Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఎల్.బి.స్టేడియంలో 21న సాయంత్రం ప్రారంభమయ్యే ఉత్సావాల నిర్వాహణ ఏర్పాట్లను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ శుక్రవారం పరిశీలించారు.ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీవెన్ సన్, ఐఎఎస్ , ఐపీఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ముగ్గురు బిషప్లు, క్రిస్టియన్ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు,పెద్దలతో పాటు సుమారు 12వేల మంది ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.