Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీ మిర్చి క్వింటా రూ.19,525, కొత్త సీజన్ మిర్చి రూ.17,211
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిర్చి ధర రోజురోజుకీ క్రమేపీ పెరుగుతోంది. మార్కెట్లో శుక్రవారం క్వింటా ఏసీ మిర్చికి రూ.19,525 జెండా పాట నిర్ణయించగా, ఇక కొత్త సీజన్ సాధారణ మిర్చి (నాస్ఏసీ)ని క్వింటా రూ.17,211లకు కొనుగోలు చేశారు. మార్కెట్లో కొంతకాలంగా ఏసీ మిర్చిని క్వింటా రూ.16,200 నుంచి రూ.16,500 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.2,000 నుంచి రూ.2,500 పెంచి కొనుగోలు చేయడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల్లో పండే తేజా రకం మిర్చికి విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంటుంది. విదేశీ ఎగుమతులు ఉంటేనే ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతు న్నారు. ఏసీ మిర్చి ధరలు పెరుగుతుండటంతో పాటు మార్కెట్‌కు కొత్త సీజన్ మిర్చి రానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న సుమారు 4లక్షల మిర్చి బస్తాలను విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి మార్కెట్లో కూడా గురువారం పత్తి క్వింటా రూ.8150 ఉండగా శుక్రవారం రూ. 250 పెరిగి రూ.8400 జెండా పాట అయినది. మార్కెట్‌కు మొత్తం 7,282 పత్తి బాగ్స్ వచ్చాయి. మిర్చి కొనుగోళ్లు పెరగడంతో శుక్రవారం మార్కెట్‌ను మార్కెట్ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న పరిశీలించారు.