Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఆర్ జీఎమ్ గజానన్మాల్యా
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇంధనాన్ని పొదుపు చేస్తే, ఉత్పత్తి చేసినట్టే అని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం జరిగిన వెబినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదనపు జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే ఇంధన పొదుపులో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్లు, రైల్వే లైన్ల విద్యుదీకరణ, నీటి పొదుపు, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు, ట్రాక్షన్-నాన్ ట్రాక్షన్లు, వంద శాతం ఎల్ఈడీ, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషన్లు, సెన్సార్లు సహా అనేక వినూత్న పద్ధతులను చేపడుతున్నట్టు తెలిపారు. దీనివల్ల దక్షిణ మధ్య రైల్వే అనేక అవార్డుల్ని అందుకున్నట్టు వివరించారు.