Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ మమిళా కమిషన్ చైర్మెన్
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మహిళల ను చైతన్య పరచడం ద్వారానే ప్రవాస భారతీయ భర్తల మోసాలకు చెక్ పెట్టగలమని జాతీయ మహిళా కమిషన్ చైర్మెన్ రేఖాశర్మ అన్నారు. శుక్రవారం బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా భద్రత విభాగాలు సంయుక్తంగా ఎన్ఆర్ఐ భర్తల మోసాలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 5858 ఎన్ఆర్ఐ భర్తల మోసాలపై కేసులు నమోదు అయ్యాయని అన్నారు. వీటిని పరిష్కరించడానికి దేశంలోని వివిధ ఏజెన్సీలతో పాటు విదేశాల్లోని ఏజెన్సీలతో సమన్వయమవుతూ.. కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే ఇందులో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు ఆయా దేశాల చట్టాల పరంగా ఎదురవుతున్నాయని వివరించారు. వీటిని అధిగమించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కళాశాలలో విద్యార్థులను ఎన్ఆర్ఐ భర్తలతో కలిగే మోసాల పట్ల చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వివాహానికి సిద్ధమైన యువతులు ప్రధానంగా విదేశీ మోజులో పడి అక్కడి భర్తలను ఎంచుకునే ముందు పలు అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. దేశంలో పంజాబ్,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఏపీ, తెంగాణా మొదలైన రాష్ట్రాలలోనే ఎక్కువగా ఎన్ఆర్ఐ భర్తల మోసాల కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ సునితా లక్ష్మారెడ్డి మట్లాడుతూ రాష్ట్రంలో తాజాగా 15 ఎన్ఆర్ఐ భర్తల మోసాల కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ భర్తలను ఎంచుకునే సమయంలో యువతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా , డీఐజీ సుమతిలు మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడేండ్ల నుంచి 700కు పైగా ఎన్ఆర్ఐ భర్తల మోసాల కేసులు నమోదయ్యాయని వివరించారు. వీటిని పరిష్కరించడానికి విదేశీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ.. తగిన చర్యలు తీసుకుటున్నామని తెలిపారు. ఈ కేసుల దర్యాప్తుల్లో ఓపిక అత్యంత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
1500 కోట్లు ఎంఎల్ఎం స్కాం..
ఇందు వివా డైరెక్టర్ల ను అరెస్టు ఈడీ
నిషేధిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడి పది లక్షల మందికి రూ. 1500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన ఇందు వీవా సంస్థ యజమానులను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.