Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు భద్రతపై 'బ్యాంకు'కు సీఎస్ సోమేష్కుమార్ వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ చర్యల పట్ల ప్రపంచబ్యాంక్తో కలిసి పనిచేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. శుక్రవారంనాడాయన బీఆర్కే భవన్లో ప్రపంచబ్యాంక్ లీడ్ ట్రాన్స్ పోర్ట్ ప్రతినిధి అర్నాబ్ బందోపాధ్యాయ, సీనియర్ సోషల్ స్పెషలిస్టులు వెంకట్రావ్, విజేత బెజ్జం, టెక్నికల్ కన్సల్టెంట్ కష్ణన్ శ్రీనివాసన్, ప్రభుత్వ పనుల విభాగం సీనియర్ అసోసియేట్ రజత్ భూషణ్, అదితి గుప్తా, ప్రపంచబ్యాంక్ హెల్త్ కేర్ కన్సల్టెంట్ ఆస్తా అరోరా, హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ జితేందర్, రైళ్లు, రోడ్డు భద్రత అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య సహా పలు విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రపంచబ్యాంక్ ప్రాజెక్టులపై పురోగతిని వివరించారు. ప్రమాదాల నివారణ, మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలను పర్య వేక్షించేందుకు ప్రభుత్వం కొన్ని ''యాప్''లను అభివద్ధి చేసిందనీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందనిచెప్పారు. రోడ్డు ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రపంచ బ్యాంకు బందంతో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తునామన్నారు.