Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగులకు వినతి
- తెలంగాణ రజక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజకులకు బీమా పథకం వర్తింప చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కి వినతి పత్రం అందజేసినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజు నరేష్, పైళ్ల ఆశయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి వృత్తి శిక్షణ సదస్సులో ఆమోదించిన 19తీర్మానాలను మంత్రికి అందించినట్టు తెలిపారు.వృత్తిదారులకు ఆరోగ్యపరంగా వచ్చే రుగ్మత లు, విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకోవటం కోసం రూ:5 లక్షల ''రజక భీమా'' ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీస్ శాఖలు, వివిధ సంస్థల బట్టల శుభ్రత వృత్తి పనులను రజక సొసైటీలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రజక వృత్తిదారులకు బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు అందించాలని కోరారు. రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయాలనీ, రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు సాంఘీక బహిష్కరణను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తాననీ, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు సి మల్లేష్, జ్యోతి ఉపేందర్, సభ్యులు రేవల్లి నరేష్ పాల్గొన్నారు.