Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా అమేథీలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా కాంగ్రెస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలోని ముడిమ్యాల అంబేద్కర్ విగ్రహాం నుంచి ఇందిరాగాంధీ విగ్రహాం వరకు రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్ హాజరుకానున్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు ఆయా జిల్లాలో ముఖ్యనాయకులు యాత్రలు చేయనున్నారు.
విద్యార్థుల ఫెయిల్‌కు సర్కారే బాధ్యత వహించాలి : రేవంత్
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ కావడానికి ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో లక్షలాది మంది పేద పిల్లలు విద్య బోధనకు దూరమయ్యారని ట్వీట్టర్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఆన్లైన్ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందువల్లే తాము ఫెయిలయ్యామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇంటర్ విద్యార్థులకు ఆత్మహత్యలపై ఇంటర్‌బోర్డు కార్యదర్శికి ఎన్ఎస్యూఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.