Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరవధిక సమ్మెకు వెళ్తాం
- మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక
- రెండో రోజూ కొనసాగిన వంటావార్పు
నవతెలంగాణ-విలేకరులు
మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వమే కార్మికులను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదని అన్నారు. మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘం (సీఐటీయూ), తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) 48 గంటల నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం కలెక్టరేట్ల ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపి వంటావార్పు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రెండు రోజుల వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కార్మికులకు మద్దతు తెలిపి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులను దేవుళ్లతో పోల్చిన సీఎం కేసీఆర్ వాళ్ల పొట్టగొడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న సీఎం,వారిని దేవుళ్లతో పోల్చారన్నారు. ఇప్పుడు..రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ందరికీ వేతనాలు పెంచినప్పటికీ మున్సిపల్ కార్మికు లకు మాత్రం పెంచకుండా వారి పొట్టగొడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహ న్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వంటావార్పు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కలెక్ట రట్ ఎదుట వంటావార్పు నిర్వహించారు. కార్మికులు గంటసేపు గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయాల ఎదుట వంటావార్పుతో నిరసన కొనసాగించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. గద్వా ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జేసీ రఘురాం శర్మకు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.