Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2.40 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
- 10 మంది అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు
- రూ.8 లక్షలు, 19 సెల్ఫోన్లు, లారీ, రెండు కార్లు స్వాధీనం
నవతెలంగాణ-హయత్‌నగర్
హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 2.40 క్వింటాళ్ల గంజాయి, రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్లోని క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు.కేరళ రాష్ట్రానికి చెందిన శివన్ కృష్ణన్ జీవనోపాధి కోసం రెండేండ్ల కిందట ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌కు వలస వెళ్లాడు. ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలోని కలిమెల మండలం అల్లూరుకోట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గతంలో అతడు ఏజెన్సీ ప్రాంతంలో సుబ్బారావుతో కలిసి గంజాయి సరఫరాదారుల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. కాగా, సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన అంగడి ఉపేందర్ గతంలో ఇదే తరహా కార్యకలాపాలకు పాల్పడగా అతనిపై 2015, 2016లో రాజమండ్రి సిటీ, ఖమ్మం టౌన్లో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రకు చెందిన సంతోష్ బన్వర్‌లాల్, తేజస్ కుమార్ మహారాష్ట్ర రాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో గంజాయిని రవాణా చేసి విక్రయించేవారు. కేరళ రాష్టానికి చెందిన మహ్మద్ షమీర్, హరీష్ పోక్కుట్టి లారీ డ్రైవర్లు. సుమేష్ లారీ క్లీనర్. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షేక్ జిలానీ, అడిగెల ప్రకాష్, నూలు పాల్ డేనియల్ స్నేహితులు. గతంలో గంజాయి లారీతో పడ్డుబడ్డారు. తాజాగా ప్రధాన నిందితుడు శివన్ కృష్ణన్ గంజాయి అక్రమ వ్యాపారాన్ని విడిగా చేసేందుకు ప్లాన్ వేశాడు. అందుకోసం షేక్ జిలానీ, అడిగెల ప్రకాష్, నూలు పాల్ డేనియల్‌కు తన ప్లాన్‌ను వివరించాడు. వ్యాపారంలో సమాన వాటా ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు. గంజాయి సరఫరాదారుల ద్వారా అంగడి ఉపేందర్ మొబైల్ నంబర్‌ను సేకరించి.. గంజాయిని సరఫరా చేసేందుకు శివన్ కృష్ణన్ సహాయం కోరాడు. ముంబయికి చెందిన సంతోష్ బన్వర్‌లాల్, తేజస్ కుమార్‌కు విక్రయించడానికి అంగీకరించాడు. ప్లాన్ ప్రకారం అంగడి ఉపేందర్ సంతోష్ బన్వర్‌లాల్‌ను సంప్రదించి గంజాయి గురించి వివరించాడు. ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మీదుగా ముంబయి వరకు రవాణా చేయాలని అంగడి ఉపేందర్‌ను కోరాడు. దీంతో శివన్ కృష్ణన్ తన సహచరులతో కలిసి ఒడిషా రాష్ట్రానికి చెందిన గంజాయి ప్రధాన సరఫరాదారుడు సుబ్బారావు నుంచి 2.40లక్షల కేజీల గంజాయిని సేకరించి, 110 ప్యాకెట్లు ప్యాక్ చేశారు. ఒడిషా నుంచి తెచ్చి నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని అడవిలో దాచి పెట్టారు.