Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాయిబాబు
- భూపాలపల్లి జిల్లా ద్వితీయ మహాసభ ప్రారంభం
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాసంక్షేమం పట్ల కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేష్ విమర్శించారు. సీపీఐ(ఎం) భూపాలపల్లి రెండో జిల్లా మహాసభ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ శనివారం ఎర్రజెండాలతో రెపరెపలాడింది. మహాసభను సాయిబాబా, రాష్ట్ర వెంకటేష్ ప్రారంభించి మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం సరైందే అయినా.. అభివృద్ధిలో ముందుకు సాగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రజలు కరోనా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని వివరించారు. బహుళజాతి సంస్థలను, బడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ.. కార్మికులను రోడ్డు పడేస్తోందన్నారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు దశలవారీగా పోరాటాలు చేస్తూనే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.