Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 23, 24న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం
- మోడీ, కేసీఆర్ పాలనలో పేదలకు ఒనగూరిందేమీ లేదు
- సీపీఐ(ఎం) మెదక్ జిల్లా 14వ మహాసభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
దేశ రాజధాని ఢిల్లీలో 365 రోజుల పాటు ఆందోళనలతో హోరెత్తించి.. కేంద్రం మెడలు వంచిన రైతుల ఉద్యమ స్ఫూర్తితో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలపై పోరాటం చేద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో సీపీఐ(ఎం) మెదక్ జిల్లా 14వ మహాసభ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం అధ్యక్షతన శనివారం ప్రారంభమైంది. చుక్క రాములు ప్రారంభోపన్యాసం చేస్తూ.. మూడు నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఏడాది పాటు చేసిన పోరాటంతోనే ప్రధాని మోడీ వెనక్కి తగ్గి.. అన్నదాతలకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. రైతుల ఉద్యమ స్ఫూర్తి, మార్గదర్శనంలో కార్మికులూ ముందడుగు వేసి పోరాటాలు చేయాల్సిన అవసరముందన్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో పెట్టుబడిదారులు, కార్పొరేట్లను కాపేడేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో పోరాటాలు చేస్తున్నట్టు నటిస్తున్న బీజేపీని నమ్మితే.. ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని అన్నారు. కేసీఆర్, మోడీని నమ్మొద్దన్నారు. కేసీఆర్ సీఎంగా ఏడేండ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నా.. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జయలకిë, సీఐటీయూ ప్రాక్షన్ కమిటీ సభ్యులు మల్లికార్జున్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు బొప్పని పద్మ, సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.