Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో కేక్ మిక్సింగ్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా ఈ వేడుకలను కాలేజీ యాజమాన్యం శనివారం హైదరాబాద్‌లోని కవాడిగూడలో నిర్వహించింది. ముఖ్యఅతిధిగా ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మెన్ ఎ పరమేశ్వర్, వైస్ చైర్మెన్ ఎ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయని చెప్పారు. కేక్ మిక్సింగ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అనుభ వం వస్తుందన్నారు.ఇది వారికి ఎంతో ఉపయో గమని అన్నారు. జాహ్నవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మెన్ ఎ పరమేశ్వర్ మాట్లాడుతూ ఈ కోర్సులో చదివిన విద్యార్థులకు హౌజ్‌కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, కిచెన్ హౌజ్, ఫుడ్ ప్రాసెసింగ్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజ్‌కృష్ణ హోటల్ హెచ్ఆర్ మేనేజర్ విపాసాసేత్ సుందర,ం మారియట్ హోటల్ మెయిన్ చెఫ్ అనూప్ గంగూలీ, గ్రీన్‌పార్క్ హెచ్ఆర్ మేనేజర్ రవికాంత్, గోల్కొండ హోటల్ హెచ్ఆర్ మేనేజర్ స్వాతి, జాహ్నవి కాలేజీ అకడమిక్ డైరెక్టర్ ఎం నర్సింగ్‌రావు, ప్రిన్సిపాల్ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు.