Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే వైవిధ్యమైన తెలుగు వర్సిటీ బంగారు విశ్వవిద్యాలయంగా ఎదగాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఆ దిశగా వీసీ టి కిషన్‌రావు కృషి చేయాలని కోరారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో శనివారం 2018 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన నవీన్ మిట్టల్ వివిధ రంగాల్లో ప్రముఖులైన 12 మందిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన కాకుండా తెలుగు భాష సాహిత్యం, లలిత కళలకు చెందిన నిష్ణాతులను పురస్కారాల పేరుతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. బాచుపల్లి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు కళాశాల విద్యాశాఖ సహకారం ఉంటుందన్నారు. ఆత్మీయ అతిధి సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కుహనా సంస్కృతిని విడనాడి సమాజ కట్టుబాట్లతో, విలువలతో ప్రతిభను నిరూపించుకున్న ప్రతిభా మూర్తులకు పురస్కారాలివ్వడం హర్షణీయమని చెప్పారు.