Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్సాహపూరితంగా ఎన్పీఆర్డీ కళా ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల్లో విశ్వాసం పెంచేందుకే ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహంచడం హర్షణీయమని హెలెన్ కెల్లేర్ విద్యాసంస్థల చైర్మెన్ పి ఉమర్ఖాన్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ ఖాన్ మాట్లాడుతూ వికలాంగుల్లో దాగున్న ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక ఉత్సవాలు ఉపయోగపడతాయని చెప్పారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అందరూ వినియోగించుకోవాలన్నారు. మాటలు రాని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పించారని చెప్పారు. టీఏఎస్ఎల్పీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, ఇమ్మధ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతిభ ఎవరి సొత్తూ కాదనీ, వికలాంగులు సకాలాంగులతో సమానంగా అనేక రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడివయ్య మాట్లాడుతూ చట్టాలు, సంక్షేమ పథకాలను కళారూపాల ద్వారా వికలాంగుల్లోకి విస్తృతంగా తేసుకుపోతామని చెప్పారు. సీఐఎమ్హెచ్ఏఎన్ఎస్ ఇంఛార్జి సరిత,ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యులు శయమ్మ, రాష్ట్రకోశాధికారి అర్ వెంకటేష్, నాయకులు ఉపేందర్, కవితా, యశోద, మధుబాబు, బలేశ్వర్, రాజు, దశరథ్, లక్ష్మి, రామకృష్ణ, శశికళ, అరిఫా తదితరులు పాల్గొన్నారు.