Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలతో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విద్యార్థి సంఘాలు సోమవారం తలపెట్టిన జూని యర్ కాలేజీల బంద్కు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.పద్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అనవసరంగా సెకండియర్ విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించిన తప్పిదానికి సగం మందిపైగా విద్యార్థులు ఫెయిలయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అర్ధం చేసుకోకుండా విద్యా ర్థులెవరూ ఫిర్యాదు చెయ్యలేదని బోర్డు బుకాయిం చడం తగదని హితవు పలికారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫెయిలైన అంద రికీ కనీస పాస్ మార్కులు ఇవ్వాలని వారు కోరారు.