Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆత్మహత్యలన్నీ.. ప్రభుత్వ హత్యలే!: షర్మిల
నవతెలంగాణ-కౌడిపల్లి
తెలంగాణలో వరి వేస్తే రైతులకు ఉరే మిగిలిందనీ, వరి వేయొద్దన్న సీఎం మాకొద్దంటూ వైఎస్సార్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణలో రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో అప్పులు బాధతో ఆత్మహత్యకు పాల్పడిన పలువురు రైతుల కుటుంబాలను 'రైతు ఆవేదన యాత్ర'లో భాగంగా ఆదివారం ఆమె పరామర్శించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్‌పల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న దుంపల మహేష్, శేఖర్‌గౌడ్, గాండ్ల శ్రీకాంత్ కుటుంబీకులను ఓదార్చి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో షర్మిల మాట్లాడారు. తెలంగాణలో రైతులు అధికంగా వరి పండిస్తారనీ, అలాంటిది నేడు వరి పండిస్తే ఉరే మిగిలిందని వాపోయారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం ప్రకటిం చడం ఎంతవరకు సమంజసమన్నారు. రూ.లక్ష కోట్లు అప్పుగా తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. వరిని పండించబోమని కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటని తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.లక్షల కోట్లకు పడగలెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా.. ఏ ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయకపోగా, ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారకులయ్యారని విమర్శించారు.