Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలి: వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేడు జరగనున్న జూనియర్ కళాశాలల బంద్ ను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అర్.ఎల్.మూర్తి , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివ రామక్రిష్ణ, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాము ,ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశరాం మాట్లాడారు. ఫెయిలైన ప్రతి విద్యార్థినినీ కనీస మార్కులతో పాస్ చేయాలనీ, ఉచితంగా రీవాల్యుయేషన్ అవకాశం కల్పించాలనీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను వెంటనే విర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలైన స్పందించని విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలనీ, చనిపోయిన విద్యార్థులకు భరోసాతో కూడిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంటర్ బోర్డు, విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెయిలైన విద్యార్థుల ప్రాణాలంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. ఇంటర్ బోర్డు నిర్ణయాలు ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటున్నాయనీ, గతంలో గ్లోబరీనా ఏజెన్సీ తప్పిదాల కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, జావేద్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.నాగేశ్వర్ రావు, మహేష్, హైదరా బాద్ అధ్యక్ష కార్యదర్శులు,అనిల్, గడ్డం శ్యాం, ఏఐడీఎస్ఓ నాయకులు మల్లేష్, ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.