Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు 20న కల్టెకరేట్ల వద్ద ధర్నాలు : తెలంగాణ రైతు సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తామర వైరస్ సోకి చేతికొచ్చిన మిరప పంట పూర్తిగా దెబ్బతిందని తెలంగాణ రైతుసంఘం ఆందోళన వ్యక్తంచేసింది. నష్టపోయిన మిరప పంటకు ఎకరానికి రూ లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ల ధర్నాలు నిర్వహించి, వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చింది.ఆదివారం మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పంటలను దున్నివేసి మరో పంట వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారనీ, లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పంట తీవ్రంగా నష్టపోయిదని ఆవేదన చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ, ఎకరాకు రూ.లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని చేశారు. భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, గద్వాల జిల్లాల్లో మిరప పంట ప్రధాన వాణిజ్య పంటగా వేస్తారని గుర్తు చేశారు. ఎకరాకు రూ రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు పెట్టుబడి అవుతుందని పేర్కొన్నారు. ఎకరాకు 20-30 క్వింటాళ్ళ వరకు దిగుబడులు సాధిస్తారని వివరించారు. ఈఏడాది ధర ఒక మోస్తరుగా బాగానే ఉందని తెలిపారు. ఈ క్రమంలో మిరప పంటకు అకస్మాత్తుగా ''తామర వైరస్'' సోకి పంట మొత్తం దెబ్బతిన్నదని పేర్కొన్నారు.ప్రకృతి వైపరీత్యాల కింద క్రిమికీటకాల దాడులకు పరిహారం చెల్లించాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. స్పైసెస్బోర్డు స్పందించి ఈ నష్టానికి కారణాలను గుర్తించి బోర్డు ద్వారానైనా రైతులకు సహకరించాలని కోరారు. కేరళలో ఉన్న బోర్డుకు సబ్బోర్డుగా వరంగల్లో ఉందనీ, అది మిరప పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి, రైతులకు నష్ట పరిహారం అందేట్టు చూడాలని కోరారు. మూకుమ్మడిగా వైరస్ సోకడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.