Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి దక్కదన్న ఆవేదనతో..
- పోడు రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-బోథ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం జీడిపల్లె గ్రామానికి చెందిన పోడు రైతు మడావి లక్ష్మణ్(48) పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామసమీపంలో మడావి లక్ష్మణ్‌కు 5 ఎకరాల పోడు అటవీ వ్యవసాయ భూమి ఉంది. బోథ్ అటవీ అధికారులు ఆ భూమిలో నీటి కుంట నిర్మించేందుకు వెళ్లగా.. రైతుకు, అటవీ అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఆందోళన చెందిన రైతు లక్ష్మణ్ తన భూమి తనకు దక్కుతుందో.. లేదోనని మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఆయన్ను బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అక్కడి నుంచి అదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజు తెలిపారు.