Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జైభీమ్ సినిమా రియల్ హీరో, జస్టిస్ చంద్రును ప్రజాసంఘాల నేతలు కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన్ను ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐలు జాతీయ నాయకులు పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం నిలబడిన నిజమైన హీరో అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు ప్రజానీకంలోకి విస్తృతంగా వెళ్లాలని చంద్రు అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రంలోని సాంగ్లి లాంటి జిల్లాలు, గ్రామాల్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారనీ, తెలుగురాష్ట్రాల్లో కూడా ఆ రకమైన ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణరాష్ట్రంలో న్యాయం కోసం, ప్రజల హక్కుల కోసం దీన్ని ప్రజానీకంలోకి తీసుకపోవాలని సూచించారు. అందుకోసం తాము కృషిచేస్తామని ప్రజాసంఘాల నాయకులు చంద్రుకు తెలియజేశారు.