Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ నుంచి కలెక్టరేట్ వరకు
నవతెలంగాణ-ఇచ్చోడ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం కామగిరి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సర్పంచ్ తొడసం భీమ్రావు పాదయాత్ర చేపట్టారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామస్తులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్ర రాత్రి వరకు గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది గ్రామానికి చేరుకుంటుంది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బసచేసి తిరిగి సోమవారం ఉదయం 7గంటలకు పాదయాత్ర తిరిగి కొనసాగించి 11గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ ం చేరుకొని కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటైనప్పుడు గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారనీ, కానీ ఇప్పుడు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంతోవా రు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదన్నారు. పంచాయతీ భవన నిర్మాణం, సీసీ రోడ్లు, మురికికా లువలు నిర్మించాల్సి ఉందని తెలిపారు. అర్హులైన వృద్ధులు,ఒంటరి మహిళలు,వికలాంగులకు ఆసరా పింఛన్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్య ం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ భవనం పునర్నిర్మాణం చేయాలని కోరారు. చేసిన పనులకు సైతం బిల్లులు రావడం లేదని ఆరోపించారు. గ్రామస్తుల సహకారంతో వినూత్న రీతిలో పాదయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా పాదయాత్రతో చేరుకొని కలెక్టర్కు సమస్యలపై వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు.