Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్త్నెకి తాగునీటి సరఫరాపై చర్చ
- పాల్గొననున్న ఐదు రాష్ట్రాల అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)తాగునీటి కమిటీ సమావేశం ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఈ కమిటీ ఆరో భేటి నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదు రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు. కేఆర్ఎంబీ ప్రతినిధులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తెలుగుగంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా అంశంపై కేఆర్ఎంబీ ప్రతినిధులు, ఐదు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు.