Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హాల్ట్ స్టేషన్లు మినహాయించి మిగతా అన్ని 588 రైల్వే స్టేషన్లలో ఉచిత హై-స్పీడ్ వై ఫై సేవలను విస్తరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి కృషి చేసిన సిగల్, టెలికమ్యునికేషన్ విభాగం అధికారులను, రైల్ టెల్ అధికారులను, ఇతర సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు.