Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును గురుకులాల్లో పోస్టులను భర్తీ చేసే బోర్టు సవాల్చేసిన అప్పీల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. టీజీటీ పోస్టులకు బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులన్న నిబంధనను 2014లో మారిందని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ చెప్పింది. నేషనల్ టీచర్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రూల్స్-2014 ప్రకారం బీటెక్ పూర్తిచేసి బీఈడీ చదివిన వాళ్లు సైతం అర్హులని తీర్పు చెప్పింది. బోర్డు నాలుగు వారాల్లోగా నియామకాలు చేయాలనీ, అభ్యర్థులు జోనల్ పరిధిలోకి వచ్చే అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
యూనివర్సిటీల్లో రిజర్వేషన్లపై పిల్
తెలంగాణలోని ప్రయివేట్ యూనివర్సిటీల్లో స్థానికులకు 85 శాతం కాకుండా కేవలం 25 శాతమే రిజర్వే షన్లు కల్పించారంటూ తప్పుపడుతూ దాఖలైన పిల్లో హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. సామాజిక కార్య కర్త రాథోడ్ సుబేందర్‌సింగ్ వేసిన పిల్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివి జన్ బెంచ్ విచారించింది. రాజ్యాంగంలోని 371-డీ ఆర్టి కల్ ప్రకారం రిజర్వేషన్లు 85శాతం ఉండాలని పిటిషనర్ వాదించారు. ఈనిబంధన ప్రభుత్వ యూనివర్సి టీలకు వర్తి స్తుందనీ, ప్రయివేట్ విశ్వవిద్యాలయాలకు కాదని ప్రభుత్వం చెప్పింది. విచారణ వాయిదా వేస్తున్నామనీ, ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రికవరీ మాటేమిటీ : హైకోర్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతలతాన గ్రామంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు కోసం భూమి సేకరణ పేరుతో బురుజుకు ప్రయివేట్ వ్యక్తికి రాష్ట్ర అధికారులు రూ.55 లక్షలు చెల్లించారన్న అభియోగాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లోతుగా విచారణ చేసి చర్యల నివేదికను జనవరి 4న జరిగే విచారణలో చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. బురుజుకు పరిహారంగా రూ.55 లక్షలు చెల్లింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆర్ శంకర్రావు వేసిన పిల్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.