Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబాయి నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు
- హైదరాబాద్‌కు తరలింపు
నవతెలంగాణ - ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఓ వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించారు. గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 16న దుబాయి నుంచి వచ్చాడు. అప్పుడు హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటీవ్ రావడంతో ఇంటికి పంపించారు. ఆయన్నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షలకు పంపించగా.. ఒమిక్రాన్ తేలింది. దాంతో వెంటనే జిల్లా వైద్య అధికారులు గ్రామానికి చెరుకుని ఆయన్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. ఆయనతోపాటు ఇదే మండలంలోని చిప్పలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా దుబాయి నుంచి వచ్చాడు. ఆయనకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు.