Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రక్షణ సిబ్బందికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నివాళులు అర్పిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పారా కమాండో లాన్స్ నాయక్ వివేక్ కుమార్, పారా కమాండో లాన్స్ నాయక్ బి.సాయి తేజ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున బీమా క్లెయిమ్‌ను పీఎన్బీ త్వరితగతిన ముందస్తుగా సెటిల్ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని జైసింగ్‌పూర్ వివేక్ కుమార్ 2012లో తన సైనిక వృత్తిని ప్రారంభించారు. ఆయన స్పెషల్ ఫోర్సెస్‌లో జమ్మూకాశ్మీర్‌లో సేవలందించారు. బి.సాయి బి సాయి తేజ 2013లో ఆర్మీ ప్రయాణం మొదలుపెట్టారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ జనరల్ బిపిన్ రావత్ సహా పలువురు యోధులు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వీరికి పీఎన్బీ మేనేజ్మెంట్, ఉద్యోగులు సంతాపం తెలుపుతూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించి.. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, సంజీవన్ నిఖార్ (హైదరాబాద్‌లోని పీఎన్బీ జోనల్ మేనేజర్), ఏయూబీ రెడ్డి (విజయవాడ పీఎన్బీ సర్కిల్ హెడ్), విజరు శంకర్ రెడ్డి (చిత్తూరులో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి)లు సాయి తేజ కుటుంబానికి క్లెయిమ్ సెటిల్మెంట్ చెక్కును అందజేశారు. 11 మంది అమరుల్లో ఇద్దరు పీఎన్బీ రక్షక్ సాలరీ పథకం కింద కవర్ చేయబడ్డారని పీఎన్బీ పేర్కొంది.