Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
నవతెలంగాణ - గోదావరిఖని
రెండు లారీలు ఢకొీని.. అందులోని ఓ లారీ పక్క నుంచి వస్తున్న ఆటోపై పడటంతో ముగ్గురు మృతిచెందారు. వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం రాత్రి రాజీవ్ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..కరీంనగర్ వైపుకు వెళ్లేందుకు గోదావరిఖని గంగానగర్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకొని ఎక్కుతున్న బొగ్గు లోడ్ లారీని మంచిర్యాల వైపు వెళ్తున్న బూడిద లోడు లారీ వేగంగా వచ్చి ఢకొీట్టింది. దాంతో రెండు లారీలు రోడ్డుకు చేరో పక్కన అడ్డంగా పడిపోయాయి. అయితే, బూడిద లోడు లారీ.. పక్కనే వస్తున్న ఆటోపై పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న రామగుండం ముబారక్నగర్కు చెందిన ఒకే కుటుంబీకులు షేక్ షకీల్(28), ఆయన భార్య షేక్ రేష్మ(22), 7 నెలల కుమార్తె షేక్ ఫాథిమా మృతిచెందారు. మరో ఐదుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. మంచిర్యాల జిల్లా ఇందారంలో బంధువుల శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలంలో పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన..
బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురి మృతదేహాలను మంగళవారం రాజీవ్ రహదారిపైపెట్టి కుటుంబీకు లు, బంధువులు ఆందోళన చేశారు.అనంతరం మంచిర్యాలలోని బూడిదలో డు లారీ యజమాని ఇంటి వద్దకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు యత్నిం చగా పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు.సదరు లారీ యజమానితో చర్చించి నష్టపరిహారం ఇప్పించేందుకు ఒప్పించారు.దీంతో వారు ఆందోళన విరమించారు.