Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల విద్యాధికారులకు (డీఈవో) ఊరటనిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. 1998-డీఎస్సీ నియామాకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయలేదన్న కోర్టు ధిక్కార కేసులో డీఈవోలకు 2 నెలలు జైలు శిక్ష, రూ. 2 వేలు చొప్పున జరిమానా విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల డీఈవోలకు ఉపశమనం లభించింది. సింగిల్ జడ్జి విధించిన శిక్ష, జరిమానాలను రద్దు చేయాలని డిఈవోలు వేసిన అప్పీళ్లను మంగళవారం విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను వెలువరించింది. కావాలని సుప్రీంకోర్టు, ఇతర ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ప్రభుత్వం చేసిన వాదనను ఆమోదించింది. దీంతో పూర్వం సింగిల్ జడ్జి ఇచ్చిన కోర్టు ధిక్కార ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలను వెలువరించింది.