Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
నవతెలంగాణ - గంభీరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాగుల దేవయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25వేలు అందజేశారు. కుటుంబీకులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రావుల దేవయ్య రెండుసార్లు బోర్లు వేసి అప్పులపాలై.. అవి తీర్చే దారి లేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటన్నారు. కనీసం బాధిత కుటుంబాన్ని ఆదుకోక పోవడం బాధాక రమన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు బోర్ల కోసం రైతులకు సహాయం అందించారని గుర్తుచేశారు. రైతుబంధు ఇచ్చి అనేక రాయితీలు కోత విధించారని అన్నారు. రుణమాఫీ చేస్తారని ఆశతో వడ్డీలు కట్టకపోవడంతో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతులు బయట అప్పులు తెచ్చుకొని మిత్తి మీద మిత్తి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.