Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
- పరిస్థితి విషమించి మృతి
నవతెలంగాణ-కామేపల్లి
ఆశించిన స్థాయిలో మిర్చి పంట దిగుబడి రాకపోగా.. వైరస్ సోకి కళ్ళెదుటనే ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే దిగులుతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య వాగ్య(55) తనకున్న రెండెకరాల భూమితోపాటు ఎకరం కౌలుకు తీసుకొని మొత్తం మూడు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోగా కళ్ళెదుట మిర్చి పంట ఎండిపోవడంతో దిగులు చెందిన రైతు ఈనెల 19న చేనులోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం ఉదయం మృతిచెందాడు. మృతుని కుమారుడు భూక్య రవి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీ భార్గవి కేసు నమోదు చేశారు.