Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్వకుర్తి
సీపీఐ(ఎం) నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శిగా వర్ధం పర్వతాలు రెండోసారి ఎన్నికయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా మహాసభ ముగింపు సందర్భంగా ప్రతినిధులు 21 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత, దేశ్య నాయక్, చింత ఆంజనేయులు, భూషమేని ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులుగా ఏపీ మల్లయ్య, బాల్ రెడ్డి, బాలస్వామి, మల్లేష్, నిర్మల, శంకర్ నాయక్, అశోక్, శివ వర్మ, ఈశ్వర్, నరసింహా, ఎం.శ్రీనివాసులు, గోపాల్ తదితరులు ఎన్నికయ్యారు.