Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి విద్యాసంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను మంగళవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులతో పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించాలని కోరారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అవకతవకలకు కేంద్రమైన ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఓయూ కార్యదర్శి రవినాయక్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పరుశురాం, నాయకులు వి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.