Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ విద్యారంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు, గురుకుల విద్యాసంస్థల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిలయ్యారని అన్నారు.
ఈ అంశం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తానని వివరించారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా కృషి చేసా ్తనని చెప్పారు. ఈనెల 16న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,24,012 (49శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 (51శాతం) మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇప్పటి వరకు ఫెయిల్ కావడం, తక్కువ మార్కులురావడంతో మనస్థాపంచెంది ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య లకు పాల్పడ్డారు. కనీస మార్కులతో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.