Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డ ఫామ్‌హౌస్ సిబ్బంది
- రాత్రి 9 గంటలు దాటినా కూలీలను బయటకు పంపని వైనం
- మృతుడి తల్లిదండ్రులకు సైతం లోనికి అనుమతి నిరాకరణ
నవతెలంగాణ-మర్కుక్
సీఎం వ్యవసాయ క్షేత్రంలో పనికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. విషయం బయటికి పొక్కకుండా ఫామ్ హౌస్ సిబ్బంది జాగ్రత్త పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటజిల్లా మర్కుక్మండల పరిధిలోని వరద రాజ్పూర్ గ్రామానికి చెందిన రెడ్డమైన అంజనేయులు (19) సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో దినసరి కూలీగా పనులకు వెళ్తున్నాడు. రోజువారి మాదిరిగానే మంగళవారం కూడా పనులకు వెళ్లాడు. ఈక్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిపక్కన గడ్డి కోస్తుం డగా ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. గమనించిన తోటి కూలీలు.. ఫామ్ హౌస్ నిర్వహ కులకు సమాచారం అందించారు. ఫామ్ హౌస్ సిబ్బంది ఈ విషయం బయటకు పొక్క కుండా పోలీసులసాయంతో తోటికూలీలను రాత్రి 9గంటలు దాటినా బయటికి రానివ్వ లేదు. రాత్రి 9 గంటల తర్వాత గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులను ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల వరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మృతుడి తల్లిదండ్రులు వరదరాజ్‌పూర్‌లోని హనుమాన్ దేవాలయం వద్ద పడిగాపులు కాస్తూ శోకసముద్రంలో మునిగిపోయారు.