Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) సేవలు భేష్ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. ఈఎస్సీఐ సేవల గుర్తింపుగా వచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డును డైరెక్టర్ జి.రామేశ్వర్రావు ఆధ్వర్యంలోని బృందం బుధవారం గవర్నర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఈఎస్సీఐ అందిస్తున్న సేవల గురించి రామేశ్వర్రావు వివరించారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్జీవన్ మిషన్లో భాగస్వాములుగా ఉన్నామని తెలిపారు. వృత్తిపరమైన శిక్షణ, నైపుణ్య శిక్షణలు ఇస్తున్నట్టు చెప్పారు.