Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విద్యానగర్
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలవడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. రిక్షా కాలనీకి చెందిన బుర్రివార్ గజానంద్ కుమార్తె నందిని(17) జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 16న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది 17వ తేదీన సూపర్ వాస్మోల్ ఆయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి వెంటనే కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందింది. విద్యార్థిని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.