Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఆర్ అచీవర్స్ అవార్డుల ప్రదానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యాన బుధవారం హెచ్ఆర్ విభాగంలో లక్ష్యాలను సాధించిన వివిధ కంపెనీల ప్రతినిధులకు అచీవర్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ హాజరయ్యారు. జెకె ఫన్నీర్ ఇండియా లిమిటెడ్, దొడ్ల డెయిరీ, టాటా కాఫీ లిమిటెడ్, తొమేగావా అవురా ఇండియా ప్రయివేటు లిమిటెడ్, ఓంశ్రీ పేపర్ టెక్ లిమిటెడ్, ఐసీఐసీఐ, టెక్వేర్ కన్సల్టింగ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్, మెడ్వెల్ వెంచర్స్, కిసాన్ ఫ్యాషన్ మాల్ తదితర కంపెనీల ప్రతినిధులకు ఆయన చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ఉపాధ్యక్షుడు మీలా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.