Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఏడేండ్ల నుంచి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎస్‌కు బుధవారం ఢిల్లీ నుంచి లేఖ రాశారు. ఆయా కుటుంబాల్లోని బాధిత మహిళల (వితంతువులు)ను జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్... పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీకి తీసుకెళ్లారు. వారి సమస్యలను ఆయన కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయారు. ఆయా కుటుంబాలను ఆదుకోవాలంటూ కోరారు. స్పందించిన మంత్రి.. సీఎస్‌కు లేఖ రాసినట్టు సురేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.