Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి, 35 మార్కులతో పాస్ చేశాయని గుర్తుచేశారు. ఆలస్యం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం 12 గంటల్లో నిర్ణయం తీసుకోవాలనీ, లేకపోతే ఇంటర్‌బోర్డు వద్ద దీక్ష చేస్తానని హెచ్చరించారు.
భూసమస్యలపై జనవరి 30 నుంచి పాదయాత్ర : మహేష్‌కుమార్‌గౌడ్
భూసమస్యలపై జనవరి 30 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రంలోని సేవాగ్రాం వరకు కొనసాతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ పాల్గొంటారనీ, జాతీయ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారని వివరించారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు హర్కర వేణుగోపాల్, మెట్టుసాయికుమార్ తదితరులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.పేదలకు మాత్రం ధరణి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని ఆయన చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి : బక్క జడ్సన్
మందుల కోనుగోళ్లు, వైద్య ఆరోగ్యశాఖల్లో నియామకాలు, బదిలీ విషయంలో అక్రమాలు జరిగాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలంటూ ఈమేరకు బుధవారం ఆయన సీబీఐకి ఫిర్యాదు చేశారు. మంత్రి హరీశ్‌రావు, డీహెచ్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.