Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూడాన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్/హయత్‌నగర్
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి హయత్‌నగర్‌లోని సత్యనారాయణ కాలనీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. కాలనీ చెందిన ఓ యువకుడు(24) బిజినెస్ పనిపై తూర్పు ఆఫ్రికా, సుడాన్ దేశానికి ఈ ఏడాది జనవరిలో వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 18న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడే అతనికి టెస్ట్ చేయగా మంగళవారం పాజిటివ్ అని తేలింది. దాంతో హెల్త్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా కాలనీ వాసులందరికీ కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించారు. సుమారు 30 మందికి టెస్టులు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చింది. అలాగే బాధితుడి కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేశారు. పాజిటివ్ వచ్చిన యువకుడిని 108 ద్వారా గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్టు అబ్దుల్లాపూర్‌మెట్ పీహెచ్సీ డాక్టర్ శ్వేత తెలిపారు. కాలనీ పరిసరాల్లో అధికారులు శానిటేషన్ చేయించారు. సిటీ శివారులోకి ఒమిక్రాన్ పాకడంతో శివారు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆందోళన చెందకుండా అందరూ కొవిడ్ రూల్స్ పాటించాలనీ, వ్యాక్సిన్ తీసుకోనివారు ఉంటే తీసుకోవాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.నాగరాణి, మెడికల్ అధికారిని డా. శ్వేత, ఆర్బిఎస్కె. టీం డా. సంపత్, ఎంపీహెచ్‌ఈవో వెంకటాచారి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.