Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూఎమ్హెచ్ఈయూ డిమాండ్
- వైద్యవిధానపరిషత్, వైద్యవిద్యవిభాగం డైరెక్టర్‌కు సమ్మెనోటీసు అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య విభాగం పరిధిలోని దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియాస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. జనవరి ఐదో తేదీన సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సమ్మెకు సంబంధించిన నోటీసును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డికి టీయూఎమ్ హచ్ఈయూ బృందం అందజేసింది. ఈ కార్యక్రమంలో భూపాల్‌తో పాటు రామయ్య (నల్లగొండ), మహేశ్, భాగ్య(జగిత్యాల), రాజు (కరీంనగర్), జగన్(హుజురాబాద్), శేఖర్, నగేశ్ (గోదావరిఖని), తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా భూపాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. ఏడేండ్లుగా వేతనాలు పెంచకపోవడం దారుణమని విమర్శిం చారు. కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందు లతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలోనూ రిస్క్‌తో కూడిన సేవలందిస్తే కనీసం ప్రోత్సాహకాలు కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. వైద్య విధాన పరిషత్ విభాగం పరిధిలోని హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న పేషెంట్‌కేర్, సానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గారు ్డలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 68, 60లలో ఏదో ఒకటి అమలు చేయాలని కోరారు. పీఎఫ్‌లలో కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్న అక్రమాలు అరికట్టాలన్నారు. పీఎఫ్‌లో కార్మిక, యజమాని వాటాలు సక్రమంగా జమచేయాలని కోరారు. ఏడాదికి 24 సీఎల్స్ ఇవ్వా లని కోరారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి మ్యాన్ పవర్ నిర్వహణను ఆస్పత్రుల్లోని అధికారు లకు అప్పగించాలని విన్నవించారు. కాంట్రాక్టర్ల దోపిడీ, అవినీతి అరికట్టాలని డిమాండ్ చేశారు.