Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఎస్‌డీసీ) బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, డిజిటల్ స్కాలర్స్, అల్ఫాబీటా, మాస్టర్ మైండ్స్ సీఏ అకాడమి మధ్య ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. బిజినెస్ అనలిటిక్స్‌లో ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు డేటాసైన్స్, అనలిటిక్స్‌లో నైపుణ్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఐసీడీఎస్ నుంచి బిజినెస్ అనలిటిక్స్‌లో డిప్లొమా సర్టిఫికెట్ పొందొచ్చని సూచించారు. ఐఎస్‌డీసీ హెడ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ షోన్బాబు మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ విత్ ఆర్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్‌క్యూఎల్, ఎస్ఏఎస్, టాబ్లెయు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తో ప్రత్యేక శిక్షణను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ రీజినల్ మేనేజర్ బిజినెస్ రిలేషన్స్ అఖిల్ అగర్వాల్, విఐటీ ఏపీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సీఎల్వి శివకుమార్, స్కూల్ ఆఫ్ బిజినెస్ అసోసియేట్ డీన్ రాఘవేంద్ర, అసోసియేట్ ప్రొఫెసర్ వికాస్ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.