Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24మందితో జిల్లా కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-గార్ల
సీపీఐ(ఎం) మహబూ బాబాద్ జిల్లా కార్యదర్శిగా సాదుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార్ల మండల కేంద్రంలోని సత్తార్మియా నగర్లో రెండ్రోజులుగా జరుగుతున్న పార్టీ మహాసభలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా 24మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా సాదుల శ్రీనివాస్ రెండోసారి ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా శెట్టి వెంకన్న, గునిగంటి రాజన్న, సూర్ణపు సోమయ్య, ఆకుల రాజు, అలవాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, ఆంగోత్ వెంకన్న ఎన్నిక య్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా సమ్మెట రాజమౌళి, మండా రాజన్న, కుంట ఉపేందర్, బొమ్మన అశోక్, వై వెంకటయ్య, కుర్ర మహేష్, ఎస్ఎం రెడ్డి, గాడిపల్లి ప్రమీళ, కందునూరి కవిత, దుడ్డెల రామ్మూర్తి, బొల్లం అశోక్, మార్తినేని పాపారావు, బానోత్ సీతారాంనాయక్, మలేడి కోటయ్య, గునిగంటి మోహన్, భూక్య హరి ఉన్నారు.