Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక వసతులు, సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎమ్ఎడైడీసీ) చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బుధవారం తమ తమ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌గా మంచిగా పనిచేశారని చెప్పారు. వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేశారన్నారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎంఎస్ఐడీసీ లాంటి సంస్థకు చైర్మెన్ గా అదే తరహాలో పనిచేయాలని కోరారు. రవీంద్ర భారతి ప్రాంగణలోని సాహిత్య ఆకాడమి కార్యాలయంలో సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో జూలూరి గౌరీశంకర్ పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ.రమణ, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళా భరణం కృష్ణమోహన్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర, సిబ్బంది, మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షులు వినోద్ కుమార్, సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ, కవి యాకూబ్, పలువురు సాహితీవేత్త లు, కవులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.అదేవిధంగా వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్‌గా మూడోసారి కేతి రెడ్డి వాసుదేవ రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మలక్ పెట వికలాంగుల సంక్షేమ భవన్ కార్యాలయ ఆవరణలో మంత్రితో కలిసి కేతిరెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. సీఎం కేసీర్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.