Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి కుటుంబాలకు న్యాయం చేయాలి
- ఇంటర్ ఫలితాలపై సీఎం స్పందించాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతల డిమాండ్
- గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు విమర్శించాయి. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలనీ, న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఇంటర్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని కోరాయి. ఆదిలాబాద్‌కు చెందిన నందిని ఆత్మహత్య చేసుకుని గాంధీ ఆస్పత్రిలో బుధవారం మరణించిన విషయం తెలిసిందే. అక్కడే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఏ విజరుకుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆదిలాబాద్‌కు చెందిన నందిని ఇంటర్లో ఫెయిలయ్యాననే మనస్థాపంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. విద్యార్థులు చనిపోతున్నా సీఎం, విద్యా మంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శిం చారు. కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నా రని చెప్పారు. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోకుండా తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కనీస మార్కులతో ఫెయిలైన విద్యార్థులంద రినీ పాస్ చేయాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకోవద్దనీ, పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండీ జావేద్ మాట్లాడుతూ నందిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరవింద్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్‌రెడ్డి, ఓయూ కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు రవి తదితరులు నందిని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.
ఓయూలో అక్రమ అరెస్టులకు ఎస్ఎఫ్ఐ ఖండన
ఉస్మానియా విశ్వవిద్యాల యం (ఓయూ)లో నూతన విద్యావిధానం-2020పై సెమినార్‌ను ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకించాయి. దీంతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తితోపాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి అరవింద్, ఓయూ కార్యదర్శి ఎం రవి, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, క్రాంతిరాజ్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు ఖండించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓయూలో ఆర్ఎస్ఎస్లాంటి మత ఉన్మాద సంస్థలకు చోటివ్వకుండా భవిష్యత్‌లో తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నూతన విద్యావిధానంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థకు సెమినార్లో ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.