Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ ఏజెంట్‌గా మారినందుకే హతమార్చాం
- వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ
నంతెలంగాణ-వెంకటాపురం
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల తుపాకీ తూటా పేలింది. మంగళవారం కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్ రమేష్‌ను హత్య చేసినట్టు సీపీఐ(మావోయిస్టు) వెంకటాపురం, వాజేడు కమిటీ శాంతక్క పేరుతో లేఖ విడుదల చేశారు. రమేష్ డబుల్ ఏజెంట్‌గా మారి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నందుకే పార్టీ అభిప్రాయం మేరకు హత్య చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే పథకంలో భాగంగా పోలీసులకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. పోలీసులు మాజీ సర్పంచ్ రమేష్‌ను 2019లో ఇన్ఫార్మర్గా మార్చుకున్నారు. వెంకటాపురం ఎస్ఐ తిరుపతి అనేక సార్లు రమేష్‌ను పిలిపించుకుని మాట్లాడి డబ్బులు ఆశచూపాడని పేర్కొన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్గా మారడంతోపాటు పార్టీకి కూడా పనిచేస్తూ డబుల్ ఏజెంట్‌గా మారాడని తెలిపారు. పార్టీ ఏ సామన్లు చెప్పినా తాను తెచ్చిస్తానని చెప్పాడని పేర్కొన్నారు. అలా ఓసారి రమేష్‌కి పాలపొడి తీసుకురావాలని చెబితే ఆ విషయం ఎస్ఐకి చెప్పడంతో.. వారు విషం కలిపి ఇచ్చిన పాలపొడిని తెచ్చి తమకు ఇచ్చాడనీ, దాన్ని తీసుకున్న తమ ఉద్యమ సహచరుడు బిక్షపతి (విజేందర్) అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.
అదేవిధంగా పోలీసులకు సమాచారమిచ్చి ఓ ఎన్కౌంటర్ చేయించాడని తెలిపారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిన రమేష్‌ను హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజలకు డబ్బులు ఆశజూపి పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారనీ, ఇలా మారితే.. రమేష్‌కి పట్టిన గతే పడుతుందని లేఖలో హెచ్చరించారు. కాగా, మాజీ సర్పంచ్ రమేష్‌ను మంగళవారం మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. 2014లో సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్.. ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కాగా, సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్ కిడ్నాప్‌కు గురయ్యాడు. సరిహద్దు ప్రాంతం కొత్తపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో రమేష్ నోటిలో తుపాకీతో కాల్చి మావోయిస్టులు హతమార్చారు. రమేష్ మృతదేహన్ని బుధవారం కుటుంబ సభ్యులు గుర్తించారు.