Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి సర్కారు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ)ని రెండు పథకాలుగా గాక ఒకే ప్రాజెక్టుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీ యాజ మాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టుశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ గురువారం లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్ -1, 2లో ఈ అంశాన్ని తప్పుగా చూపించారని గుర్తు చేశారు. నాటి ఆంధ్రప్రదేశ్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులోని ఆయకట్టును మూడు లక్షల ఎకరాల నుంచి నాలుగు ఎకరాలకు పెంచారే తప్ప, దానికి సరిపోయే నీటి కేటాయింపులు చేయలేదని లేఖలో పేర్కొన్నారు.