Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 177 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధ వారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురు వారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,219 మందికి టెస్టులు చేయగా బయటపడి నట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడిం చింది. మరో4,470 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,596 యాక్టివ్ కేసు లున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీ లో అత్యధికంగా 93 మందికి కరోనా సోకింది.
14 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో బుధవారంతో పోలిస్తే గురువారం జీహెచ్ఎంసీతో సహా 14 జిల్లాల్లో కేసులు పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
11 జిల్లాల్లో తగ్గిన కరోనా
ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, వరంగల్ రూరల్, హనుమకొండ జిల్లాల్లో తగ్గాయి. మిగిలిన జిల్లాల కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.
ఆరుగురు అనుమానితులు
రిస్క్ దేశాల నుంచి 648 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఒమిక్రాన్ అనుమానంతో వారి నమూ నాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఇప్పటికే నాలుగు నమూనాలకు పరీక్షలు జరుగుతుండగా తాజా వాటితో కలుపుకుని మొత్తం పదింటి ఫలితాలు రావాల్సి ఉన్నవి. ఈ దేశాల నుంచి 23 రోజుల్లో 10,029 మంది రాగా వారిలో 70 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఆరుగురిలో మాత్రమే ఒమి క్రాన్ వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. అయితే ముప్పు లేని దేశాలుగా గుర్తించిన విదేశాల నుంచి వచ్చిన వారిలో ర్యాండమ్‌గా చేసిన పరీక్షల్లో మాత్రం 31 మందికి పాజిటివ్ వచ్చింది.