Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్‌బోర్డు వద్ద జగ్గారెడ్డి బైటాయింపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి కోరారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం రూ 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై గురువారం హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు వద్ద ఆయన బైటాయించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్వేచ్ఛలేదన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలు ఆలోచించక పోవడం సిగ్గుచేటన్నారు.