Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గురువారం సెమీ కిస్మస్ వేడుకులను ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థన చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, తెలుగు యువత అధ్యక్షులు రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ, త్యాగనిరతికి క్రిస్మస్ పండుగ చిహ్నం అని నేతలు చెప్పారు.